'మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: సిరిసిల్లలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 7 ఉదయం 11 గంటలకు మినీ జాబ్ మేళా కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన యువత యువకులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు.