కంభంలో నేలకొరిగిన భారీ వృక్షం
ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని అరాఫత్ నగర్‌లో భారీ వర్షం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న చేరుకున్న సంబంధిత అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.