స్వచ్ఛ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: ఎమ్మెల్యే
ATP: బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్, విజయనగర్ కాలనీలలో MLA బండారు శ్రావణి సోమవారం రాత్రి పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో నెలకొన్న అపరిశుభ్రత, నిండిన డ్రైనేజీలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం విషయంలో బాధ్యతగా ఉండి, ప్రతి నెలా 3వ శనివారం జరిగే స్వచ్ఛ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.