'నాలాంటి ముసలివాళ్లకు నరకం'.. సోనియా ఆవేదన

'నాలాంటి ముసలివాళ్లకు నరకం'.. సోనియా ఆవేదన

పార్లమెంట్ ఆవరణలో ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 'చిన్న పిల్లలు బాధపడుతున్నారు.. నాలాంటి ముసలివాళ్లకు ఊపిరి ఆడటం కూడా కష్టంగా ఉంది' అని వాపోయారు. దీనిపై ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. అమ్మకు శ్వాస సమస్యలు ఉన్నాయి, టీబీ ఉంది. ఆమె లాంటి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు' అని తెలిపారు. ఏటా ప్రకటనలే తప్ప యాక్షన్ లేదని మండిపడ్డారు.