బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ... టెండర్లు రద్దు
AP: బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ కోసం చేపట్టిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. కాగా, ఈ ప్రాజెక్టును తెలంగాణ మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది.