అన్నమయ్య జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక
అన్నమయ్య: దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, వృక్షాల దగ్గరికి వెళ్లవద్దని సూచించారు. సుదూర ప్రయాణాలు నివారించాలని, ప్రమాదాలు గమనిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.