యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక ఉల్లాసం

అన్నమయ్య: యోగాతో మానసిక ప్రశాంతత శారీరక ఉల్లాసం లభిస్తుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సబ్ డివిజనల్ కార్యాలయం నందు పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ యోగాసనాలు చేశారు. ఇందులో భాగంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శారీరక మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం చూపుతుందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలన్నారు.