VIDEO: గాలి వానకు ప్రధాన రహదారిపై భారీ వృక్షం

GDWL: జిల్లాలో గద్వాల-అయిజ ప్రధాన రహదారిలో బూడిదపాడు, అమరవాయి గ్రామాల మధ్య ఆదివారం గాలి వాన కారణంగా భారీ వృక్షం రోడ్డుపై విరిగి పడింది. దీంతో రోడ్డు మూసుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో అధికారులు వెంటనే స్పందించి వృక్షాన్ని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.