యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాక్
ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. అగ్రరాజ్య యుద్ధ విమానాలకు తమ భూభాగంలో దిగేందుకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు కుమార దిస్సనాయకే వెల్లడించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా రెండు సార్లు యుద్ధ విమానాలు దిగేందుకు అనుమతి కోరిందని చెప్పారు. కానీ దేశ తటస్థ విధానాన్ని కాపాడేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.