శంషాబాద్ విమానాశ్రయానికి అవార్డు
HYD: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్- 2026లో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందింది. భారత్, దక్షిణ ఆసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బందిగా అవార్డు దక్కగా, ప్రాంతీయ విభాగంలో 2వ స్థానం, మొత్తం విమానాశ్రయాల్లో 3వ స్థానం సాధించింది. అలాగే 20-30 మిలియన్ ప్రయాణికుల విభాగంలో వరల్డ్ 8వ ర్యాంకు దక్కింది.