'రైతులు పండ్ల తోటలను సద్వినియోగం చేసుకోవాలి'

'రైతులు పండ్ల తోటలను సద్వినియోగం చేసుకోవాలి'

KRNL: రైతులు పండ్ల తోటలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు పండ్లతోట పెంపకం కింద నందవరం మండలానికి సంబంధించి 5 గ్రామపంచాయతీలలో 16 ఎకరాలకు గానూ 12 మంది రైతులకు డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, చీని, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి వంటి మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు.