బయట జ్యూస్‌లతో జర జాగ్రత్త..!

బయట జ్యూస్‌లతో జర జాగ్రత్త..!

CTR: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. అయితే, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది బయట రకరకాల జ్యూస్‌లు త్రాగుతారు. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడే అవకాశం ఉంది. పండు సహజ రుచికి భిన్నంగా అతిగా తియ్యగా ఉంటే కల్తీ జరిగినట్లు అర్థం. సహజమైన వాసన కంటే ఫ్లేవర్ ఎసెన్స్ అతిగా ఉంటే అందులో కూడా కల్తీ జరిగినట్లే. అందుకై వీలైనంత వరకు ఇంట్లోనే జ్యూస్ చేసుకోవడం ఉత్తమం.