'పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి'

MDK: రాత్రి వేళా భారీగా శబ్దాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని ఇంట్ర బ్రిక్ పరిశ్రమ నుంచి శబ్దాలు రావడంతో గ్రామస్థులు నిద్రలో ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయమై పరిశ్రమ వారితో మాట్లాడిన ప్రయోజనం లేదని, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.