నంద్యాల జిల్లాలో బైక్ ల చోరీ.. దొంగల అరెస్ట్

KRNL: కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆదివారం బైక్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది నెలల నుంచి వరుసగా నంద్యాల, కడప జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారి నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.