రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు
VKB: రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం, కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు నిర్వహించామని ఈవో బాల నరసయ్య తెలిపారు. హుండీ ద్వారా రూ. 1,71,536 ఆదాయం వచ్చిందని ఈవో నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు ఈవో శాంత కుమార్, దేవాలయ ఛైర్మన్ మైపాల్ రెడ్డి, అర్చకులు దశరథం, పాండు శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.