క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న బాలిక‌కు జ‌గ్గారెడ్డి భ‌రోసా

క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న బాలిక‌కు జ‌గ్గారెడ్డి భ‌రోసా

SRD: క్యాన్సర్‌తో బాధపడుతున్న అశ్విని అనే బాలిక సహాయం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఇవాళ ఆశ్రయించింది. ఇప్పటివరకు రూ.5 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, ఇంకా చికిత్స కోసం డబ్బులు అవసరమని తెలిపింది. సంగారెడ్డి వద్ద జరిగిన ప్రజా దర్బార్‌లో తన పరిస్థితిని వివరించగా, జగ్గారెడ్డి చలించి మిగిలిన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.