ట్రాఫిక్ నియమాల పట్ల వానదారులకు అవగాహన
కృష్ణా: గుడివాడ పెద్ద కాలువ సెంటర్లో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.