దావత్-ఈ-ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్

దావత్-ఈ-ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్

HYD: మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో దావత్-ఈ- ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ విందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హాజరయ్యారు. గత ప్రభుత్వం రంజాన్ మాసంలో తోఫా అందజేసిందని ఆయన గుర్తు చేశారు. రంజాన్ పండుగను ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.