బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత

బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత

మెదక్ - రామాయంపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ వసతి గృహంలో లక్క పురుగులు పట్టిన బియ్యంతో చేసిన అన్నం తినడంతో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో, వాంతులు చేసుకోవడంతో విద్యార్థులను అధికారులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.