చింతపల్లిలో 125 కేజీల గంజాయి స్వాధీనం

చింతపల్లిలో 125 కేజీల గంజాయి స్వాధీనం

ASR: చింతపల్లి మండలం అంతర్ల వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అరెస్ట్ చేసినట్లు చింతపల్లి సీఐ వినోద్ బాబు తెలిపారు. గురువారం మధ్యాహ్నం అంతర్ల వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా వచ్చిన ఆటోలో ప్యాకింగ్ చేసిన 125 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు.