VIDEO: ఏలేశ్వరంలో జోరుగా పందెం కోడి పుంజులు విక్రయాలు
KKD: సంక్రాంతి సమీపిస్తుండటంతో ఏలేశ్వరంలో పందెం కోళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. గురువారం స్థానిక వారపు సంతకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి పుంజులు పోటెత్తడంతో సందడి నెలకొంది. ఒక్కో పుంజు ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పలికినా.. పందెం రాయుళ్లు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. పండుగకు ముందే సంతలో పండుగ వాతావరణం కనిపించింది.