తాడేపల్లిగూడెంలో నేడు పవర్ కట్

WG: తాడేపల్లిగూడెం పట్టణం జడ్పీహెచ్, హౌసింగ్ బోర్డ్, వీకర్స్ కాలనీ ఫీడర్ల పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహమూర్తి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీకర్స్ కాలనీ, మెయిన్ రోడ్డు, మసీదు రోడ్డు, ఎఫ్సీఐ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.