ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రుణాల మంజూరు, సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన తమ సమస్యలను, ఎమ్మెల్యేకు తెలిపారు.