కొడుకులు ఉన్న అమ్మ అనాదే..!

WNP: బస్టాండ్‌లో చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ ఓ అమ్మ దీనస్థితిలో జీవనం కొనసాగిస్తుంది. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన వీపనగండ్లలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఈడిగ బాలమ్మకు పెద్దయ్యగౌడ్, అర్జునయ్య, వెంకటయ్యగౌడ్ కుమారులు ఉన్నారు. వృద్ధాప్యంలో తల్లిని చూసుకోకపోవడంతో బస్టాండ్‌లో జీవనం వెళ్లదీస్తుంది. సఖి సెంటర్ నిర్వాహకులు WNP ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించారు.