VIDEO: తుఫాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
SKLM: గార మండలం బందరు వాని పేట సముద్ర ప్రాంతాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. మొంథా తుఫాన్ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు