పుంగనూరులో సైన్స్ మేళా ప్రారంభం

CTR: పుంగనూరులోని అన్ని పాఠశాలల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవరాజు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ మేళాను MEOలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్న శెట్టి లు ప్రారంభించారు. బాల బాలికలు సైన్స్ ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు. 9 క్లస్టర్ల పరిధిలో 139 పాఠశాలల్లో సైన్స్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.