VIDEO: బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం
HNK: నగరంలోని భీమారంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ బాలికల హాస్టల్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో విద్యార్థినుల పరుపులు, బెడ్స్‌తో పాటు ఇతర సామానులు కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన విద్యార్థినులు భయంతో హాస్టల్ నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.