బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించిన ఎస్పీ
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాలలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి నిలువతో ఏర్పడుతున్న ఇబ్బందికర పరిస్థితులను ఎస్పీ శరత్ చంద్ర పవర్ సోమవారం పరిశీలించారు. వర్షపు నీటిని తోడేస్తున్న తిరిగి చేరుతుండడంతో పోలీస్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ కొలను శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ ఉన్నారు.