పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం: ఎమ్మెల్యే

కోనసీమ: 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చన్నారు.