VIDEO: ఉద్రికత్త.. మాజీ మంత్రి దిష్టిబొమ్మ దహనం

VIDEO: ఉద్రికత్త.. మాజీ మంత్రి దిష్టిబొమ్మ దహనం

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో, బహిరంగంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు మండల కమిటీ తెలిపింది. ప్రజల్లో ఆదరణ పొందుతున్న మంత్రి సీతక్క ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.