అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న 238 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 14 కార్యకర్త, 224 సహాయక పోస్టులు ఉన్నాయని పీడీ శశికళ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. అర్హులు ఆయా సీడీపీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, అత్యధికంగా తాడిపత్రిలో 42 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.