VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా.!

VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా.!

KNR: కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ.. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, మరణించిన కార్మికులకు దహన సంస్కార ఖర్చులు చెల్లించాలని కోరారు.