'ఓపెన్ స్కూల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి'
JN: జిల్లాలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశించారు. ఈనెల 20 నుంచి 27 వరకు 13 కేంద్రాల్లో మొత్తం 2,874 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల సమయంలో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.