ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

PDPL: ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయం,శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, శ్రీ కోదండ రామాలయంలో వేదమంతాలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలు భక్తుల సందర్శనతో పండుగ వాతావరణం నెలకొంది.అలాగే పట్టణంలోని పాఠశాలల్లో చిన్నపిల్లలు రాధాకృష్ణ వేషాలతో అలరించారు.