VIDEO: మండపేటలో జనార్దన స్వామి వారి తెప్పోత్సవం

VIDEO: మండపేటలో జనార్దన స్వామి వారి తెప్పోత్సవం

కోనసీమ: కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపేట బురుగుంట చెరువులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఇవాళ రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరిన స్వామి హంస వాహనంపై చెరువులో విహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.