అభివృద్ధి పనులకు శంకుస్థాపన
VSP: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలోని ఎండాడ, రుషికొండ, సాగర్‌నగర్ తదితర ప్రాంతాల్లో రూ.7.74 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, శ్మశానవాటికలు, చెరువు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.