మారకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు
JN: కొడకండ్ల మండలం రామవరం, మొండ్రాయి, ఏడునూతుల గ్రామాల్లో పోలీస్ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై చింత రాజు గౌడ్ హాజరై మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి మహమ్మారికి యువత బానిసలు కావడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు.