రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
HNK: శాయంపేట మండలం నేరేడుపల్లి, ప్రగతిసింగారం, వసంతాపూర్, కొప్పుల గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.