'మైనారిటీ గురుకుల సెక్రటరీని తొలగించాలి'

KMM: మైనారిటీ గురుకుల సెక్రటరీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.