ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలి

ప.గో: నారాయణపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం సెక్టోరల్ అధికారులు ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈవీఎం కమిషన్నింగ్ పై అవగాహణ కల్పించారు. ఈవీఎంలో బ్యాలట్ పత్రాలు ఎలా పొందుపరచాలి, ఎలా వినియోగించాలి అన్ని దానిపై మాక్ ట్రైనింగ్ నిర్వహించారు. ఆర్వో ఖాజావలి, ట్రైనీ సంయుక్త కలెక్టర్ భానుశ్రీ పాల్గొన్నారు.