కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక UPDATE
NTPC అండర్ గ్రాడ్యుయేట్-2024కు సంబంధించి RRB CBT-2 షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 20న పరీక్ష ఉంటుందని, పరీక్షకు 4 రోజుల ముందు 16న అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. గతేడాది మొత్తం 3,445 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. CBT-1లో 51,979 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.