26వేల వివాహాలు చేసిన టీటీడీ

26వేల వివాహాలు చేసిన టీటీడీ

AP: TTD నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 26,214 వివాహాలు TTD ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. వివాహాల అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించటంతో పాటు ఉచితంగా 6 లడ్డూలను అందిస్తారు. కాగా, ఈ వివాహాలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి.