పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
SRPT: అనంతగిరి లక్కవరం గ్రామానికి చెందిన మాదాసు సాయి ప్రవీణ్ (24) కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి మృతి చెందాడు. మార్చి 13న విషం సేవించిన ఆయన, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, 17 నెలల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.