నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: ఎమ్మెల్యే
ATP: అనంతపురంలో మున్సిపల్, మెప్మా అధికారులతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. నూతన శానిటరీ సూపర్వైజర్లకు పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఎక్కడా ఫిర్యాదులు రాకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.