దేవరపల్లిలో బాబు జగన్ జీవన్ రావు విగ్రహ ఏర్పాటు
కృష్ణా: తోట్లవల్లూరు మండలంలోని దేవరపల్లి గ్రామంలో బాబు జగన్ జీవన్ రావు విగ్రహ ఏర్పాటు పనులను ఎంఆర్‌పీఎస్ నాయకులు సోమవారం పరిశీలించారు. విగ్రహ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లు, స్థల సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించారు. విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించాలని నాయకులు కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.