'అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి'
BDK: అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే కోరం తెలిపారు. ఇల్లందు పట్టణంలో శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం క్షేత్రం ఛైర్మన్ సదానందం ఆహ్వాన మేరకు అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వాముల కోసం ఏర్పాటు చేసిన బిక్షను ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు.