డక్కిలి ఎస్సైగా బ్రహ్మనాయుడు బాధ్యతల స్వీకరణ

డక్కిలి ఎస్సైగా బ్రహ్మనాయుడు బాధ్యతల స్వీకరణ

TPT: డక్కిలి పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా నాయుడుపేటలో పనిచేస్తున్న వీటూరి బ్రహ్మనాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న శివశంకర్‍‌ను నాయుడుపేటకు బదిలీ చేశారు. ఎస్సై బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని, బాధితులు నేరుగా న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు తెలుపుకోవచ్చు అన్నారు.