కలెక్టర్‌పై ఫైర్ అయిన ఎమ్మెల్యే

కలెక్టర్‌పై ఫైర్ అయిన ఎమ్మెల్యే

కృష్ణా: మచిలీపట్నంలో గుడివాడ ఎమ్మెల్యే రాము డీఆర్సీ సమావేశంలో ఇవాళ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కలెక్టర్ డీకే బాలాజీపై ఫైర్ అయ్యారు. కనీసం కలెక్టర్ తన నియోజకవర్గానికి వచ్చినా.. సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు చిన్న సమాచారం ఇస్తే తప్పేంటి? అని నిలదీశాడు. తమ నియోజకవర్గానికి వచ్చి తనను కలవకుండా పోవడం ఏంటని మండిపడ్డారు.