ముధోల్ కు రూ.45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్

NRML: ముధోల్‌లో రూ.45.15 కోట్ల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. గతంలో ఇక్కడ ఐటీఐ కళాశాల (టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రితో పాటు అసెంబ్లీలో ప్రస్తావించడంతో ముధోల్లో ATC సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమన్నారు.