మాజీమంత్రిపై మరో కేసు నమోదు
NLR: మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతపాటు ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.